04-04-2025 12:00:00 AM
అబ్దుల్లాపూర్‌మెట్, ఏఫ్రిల్ 3: పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో జోరు గా అక్రమ షెడ్లు నిర్మిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం అబ్దుల్లాపూర్‌మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా అన్నారు. తట్టిఅన్నారం మాజీ ఎంపీటీసీ నల్ల ప్రభాకర్‌తో కలిసి పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ మేనేజర్ కిరణ్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పు ల నర్సింహా మాట్లాడుతూ.. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో జోరుగా అక్ర మ షెడ్లు నిర్మిస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. తట్టిఅన్నారం సర్వే నెంబర్ 105లో మున్సిపాలిటీ నుంచి ఎ లాంటి అనుమతులు తీసుకోకుండానే భారీ షెడ్డు నిర్మిస్తున్నారన్నారు.
కొంతమంది రాజకీయ నాయకుల అండతో మున్సిపాలిటీకి రావాల్సిన భారీ ఆదాయానికి గండి కొడుతూ.. రాజకీయ నాయకులు జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. ఇలాం టి అక్రమ నిర్మాణాలపై ఎవ్వరైనా ఫిర్యాదులు చేసినా వారికీ ఎంతో కొంత డబ్బులు అప్పచెప్పి... యథేచ్చగా ఆ అక్రమ నిర్మాణాల పనులను కొనసాగిస్తున్నారన్నారు.
మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై గతంలో ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న షెడ్లపై చర్యలు తీసుకోకపోతే... రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు, సీడీ ఎంఏ అధికారులకు ఫిర్యాదులు చేస్తామన్నారు.
అయినా స్పందించకపోతే మున్సిప ల్ ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించామన్నారు. వెంట నే మున్సిపాలిటీ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తట్టి అన్నారం మాజీ ఎంపీటీసీ నల్ల ప్రభాకర్, సుక్క రవికుమార్, జగన్ రెడ్డి, ఎండీ యాకూబ్, పాల్గొన్నారు.