20-03-2025 12:27:25 AM
పెద్ద అంబర్ పేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి కి వినతి
అబ్దుల్లాపూర్ మెట్, మార్చి 19 : అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ అన్నారు. పెద్ద అంబర్ పేట్ మున్సి పాలిటీలోని మత్తుగూడ గ్రామ సర్వే నెంబర్ 122, 126లో పర్మిషన్ లేకుండా అక్రమంగా భారీ కమర్షియల్ షెడ్లు నిర్మించారని... వారిపై చర్యలు తీసుకొని తక్షణమే వాటిని కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ మాట్లాడుతూ.. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో ఇటువంటి పర్మిషన్ లేకుండా అధికారులకు లంచాలు ఇస్తూ స్వేచ్ఛగా అక్రమంగా కమర్షియల్ షెడ్లు షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్న మున్సిపల్ అధికారులు నిమ్మకునీరెత్తిన వ్యవహరిస్తున్నారు.
మత్తుగూడలో ఇంత పెద్ద భారీ షెడ్లు గత సంవత్సర కాలంగా నిర్మిస్తున్నా.. అధికారులు అప్పుడప్పుడు పనులు ఆపినట్లు చేసి... అధికారుల కన్న సైగల్లో మళ్లీ నిర్మాణ పనులు చేపడుతున్నారు. గత రెండు నెలల నుంచి షెడ్ నిర్మాణం చేసేంతవరకు అధికారుల నుంచి ఎటువంటి చలనం లేకపోవడం విడ్డూరం ఉందన్నారు. దీనివలన మున్సిపాలిటీకి రావలసిన ఆదాయం భారీగా గండి కొడుతూ అధికారులు అనధికారులు జేబులు నింపుకుంటున్నారన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఆ నిర్మాణాలని కూల్చివే యాలన్నారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు నల్ల ప్రభాకర్, సుక్క రవికుమార్, ఎండి యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.