బిజెపి నేత తాండ్ర వినోద్ రావు
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులను పరిరక్షించడంతో పాటు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు కోరారు. కొత్తగూడెంలోని హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చుంచుపల్లి మండలం చింతల చెరువు ఆక్రమణ గురైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. చెరువు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, స్థలాన్ని స్వాధీనం చేసుకొని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరారు. సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువును సైతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మంలో అనేకమంది తీవ్రంగా నష్టపోయారని, వారందరిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నడుస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు నరేందర్ పాల్గొన్నారు.