calender_icon.png 30 September, 2024 | 4:10 PM

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోండి

30-09-2024 01:53:41 PM

కరీంనగర్, (విజయక్రాంతి): నగర పాలక సంస్థ అకౌంట్స్ విభాగంలో అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ.. కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే బిల్లుల చెల్లింపు జరుగుతుందని అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. చర్యలు తీసుకునే వరకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని, అకౌంట్స్ అధికారులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ చిన్నచిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ నగర పాలక సంస్థ అకౌంట్స్ సెక్షన్ లో అధికారుల చేతివాటం మొదలైందన్నారు. చేతివాటానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత... మొన్న కొత్త కమీషనర్ బాధ్యతలు తీసుకునే వరకు 15 కోట్ల 50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేశారని 10శాతం కమీషన్ ఇచ్చిన వారికి ఇంత 15 శాతం కమీషన్ ఇచ్చిన వారికి ఇంత అంటూ పేషెంట్లు చేస్తున్నారన్నారు.