పెళ్లి.. రెండు హృదయాలను కలుపుతుంది. సరికొత్త సంబంధానికి దారితీస్తుంది. అందుకే పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి, అబ్బాయి కలిసి ప్రయాణం చేయాలి. కొన్ని రోజులు మంచి ప్రదేశానికి వెళ్లాలి. వివాహానికి ముందు కలిసి ప్రయాణం వల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చు. సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.
అందుకే పెళ్లికి కొన్ని నెలల ముందు ట్రిప్‌కి వెళ్లాలని చెబుతున్నారు మానసిక నిపుణులు. దీని ద్వారా ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ప్రయాణంలో ఎటువంటి సమస్య లేకుండా ఒకరితో మరొకరు తమ భావాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అంతేకాదు.. మరపురాని క్షణాలను కూడా ఆస్వాదించవచ్చు.
జర్నీతో ఒకరిపై ఒకరు నమ్మకం పెరుగుతుంది. కలిసి భోజనం చేయడం, కలిసి ప్రయాణించడం వల్ల లోటుపాట్లు, బలాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరి సమస్యలను మరొకరు పరిష్కరించుకోవచ్చు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, అభిరుచులు కలవకపోతే వివాహం చేసుకోవడానికి నిరాకరించవచ్చు. దీనివల్ల పెళ్లయ్యాక విడాకుల వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.