calender_icon.png 2 November, 2024 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యం కోసం బుల్లెట్ తీసుకున్నా

22-07-2024 02:41:13 AM

నన్ను అడ్డుకునేందుకు అన్ని శక్తులు ఏకం అవుతున్నాయి

అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అనేదే నా నినాదం

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్

వాషింగ్టన్, జూలై 21: తాను ప్రజాస్వామ్యానికి ముప్పంటూ డెమోక్రాటిక్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు.  దేశ ప్రజల కోసం తాను బుల్లెట్ సైతం తీసుకున్నానని ఇటీవల తనపై జరిగిన హత్యాయత్నం గురించి ప్రస్తావించారు. శనివారం మిషిగన్‌లో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. రిపబ్లికన్ పార్టీ గెలిస్తే ప్రాజెక్టు 2025 పేరిట భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నాని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇందులో ఎలాంటి వాస్త వం లేదు. నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా అమెరికా ప్రజల శ్రేయస్సు, వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటా అని స్పష్టంచేశారు. 

ట్రంప్ అభ్యర్థలను తిరస్కరించాం..

రిపబ్లికన్ బృందం ట్రంప్‌కు అదనపు రక్షణ కల్పించమని చేసిన అభ్యర్థనలను తాము తిరస్కరించామని సీక్రెట్ సర్వీస్ పరోక్షంగా అంగీకరించింది.  ట్రంప్‌కు ముప్పును అంచనా వేసే విషయంలో తాము కొంచెం అలసత్వం ప్రదర్శించినట్లు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. దాడి విషయంలో స్థానిక పోలీసులదే తప్పు అని వెల్లడించింది.