28-02-2025 06:12:44 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ధరించిన వస్త్రం వ్యక్తి హుందాతనాన్ని తెలుపుతుంది ఎంత ఖరీదైన వస్త్రమైనా అది అందమైన డ్రెస్ మారిందంటే అది టైలర్ నైపుణ్యమే అని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవియన్ జిల్లా 107 ఏ కార్పొరేటు వైస్ ప్రెసిడెంట్ గోల్డెన్ స్టార్ కే సి జి ఎఫ్ కెశెట్టి సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ టైలరింగ్ డే సందర్భంగా తాండూర్ మండల కేంద్రంలోని ఐబి లో వాసవి క్లబ్ తాండూర్ ఆధ్వర్యంలో ఏళ్ల తరబడి నుండి టైలరింగ్ వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న దర్జీలను ఘనంగా సన్మానించారు. అనంతరం దర్జీలతో కలిసి వాసవి క్లబ్ సభ్యులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవియన్ గోల్డెన్ స్టార్ సంతోష్ కుమార్, వాసవి క్లబ్ తాండూర్ అధ్యక్షులు మైలారపు మధు సుధన్, మాజీ అధ్యక్షులు ఉటూరి నరేష్, కోశాధికారి రాచకొండ మహేష్, కార్యదర్శి కాసనగొట్టు మణికృష్ణ, సభ్యులు పుల్లూరు సంతోష్ కల్పన, కోడిప్యాక కరుణ తదితరులు పాల్గొన్నారు.