22-03-2025 09:50:12 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తైబజార్ వేలం పాటను ఈ నెల 25న మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించడం జరుగుతుందని పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు తెలిపారు. రోజువారి సంత రుసుములు వసూలు చేసేందుకు గాను నిర్వహించనున్న తైబజార్ వేలం పాటలో పాల్గొనే ఔత్సాహికులు వారి యొక్క ఆస్తి, నల్ల పన్నులు, లైసెన్సు ఫీజులు మున్సిపాలిటీకి బకాయి లేనట్లు స్వంత పూచికత్తుతో కూడిన సర్టిఫికెట్ జత చేసి 1000 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు ఫారం పొందాలని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు కార్యాలయం లో మున్సిపాలిటీకి బకాయిలు లేనట్లు సొంత సర్టిఫికెట్ సాలవెన్స్ సర్టిఫికెట్, డిపాజిట్ మొత్తం డిడి దరఖాస్తుతో పాటు అందచేసి వేలం పాటలో పాల్గొనాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు కార్యాలయం లో సంప్రదించాలని కోరారు.