19-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 18 (విజయ క్రాంతి): తాసిల్దార్ ల బదిలీల ఉత్తర్వులు వెలువడిన 24 గంటల్లోనే ఉత్తర్వులు తారుమారు చేసిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బదిలీ చేసిన స్థానాలలో తాసిల్దార్ ల ను మళ్లీ ఇతర స్థానాలకు బదిలీ చేయడమే కాకుండా మరికొందరికి మరో రకంగా బదిలీ చేయడం జిల్లాలో తీవ్ర దుమారం లేపుతుంది.
బదిలీ అయిన 24 గంటల్లోనే ఉత్తర్వులను తారుమారు చేయడంలో మర్మమేమిటోనని పలువురు చర్చించుకుంటున్నారు. అధికారులపై ప్రజా ప్రతినిధుల ఒత్తిడీల మేరకే ఉత్తర్వులను తారుమారు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా బదిలీ ఉత్తర్వులు వేలు వడిన తర్వాత ఉత్తర్వులు రద్దు కావడం ఇంతవరకు కామారెడ్డి జిల్లాలో ఎప్పుడు జరగలేదు.
బదిలీ స్థానాలు నచ్చకుంటే డిప్యూటేషన్ పై వెళ్లిన సంఘటనలు ఉన్నాయి కానీ 24 గంటల్లోనే బదిలీ ఉత్తర్వులు తారుమారు కావడం తాసిల్దార్ ల బదిలీ లో రాజకీయం చోటు చేసుకోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పలుకుబడి ఉన్న తాసిల్దార్లు తమకు ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ చేశారని తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావ డంతోనే జిల్లా ఉన్నతాధికారిపై ప్రజాప్రతినిధులు కొందరు ఒత్తిడి తేవడం వల్లే బదిలీ ఉత్తర్వులు 24 గంటల్లోనే తారుమారు అయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సోమవారం కామారెడ్డి జిల్లాలో 15 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిచ్కుంద మండల తాసిల్దార్ గా పనిచేస్తున్న సురేష్ రాజంపేట కు బదిలీ అయ్యారు రేణుక చౌహాన్ డోంగ్లి నుంచి లింగంపేటకు హిమబిందు జుక్కల్ నుంచి పాల్వంచకు వేణుగోపాల్ పిట్లం నుంచి బిచ్కుందకు మహేందర్ కుమార్ ఎల్లారెడ్డి నుంచి జుక్కల్ కు బదిలీ అయ్యారు.
రాజా నరేందర్ గౌడ్ లింగంపేట్ నుంచి డోంగ్లికి మాచారెడ్డి నుండి శ్వేత గాంధారికి జయంత్ రెడ్డి పల్వాంచ నుంచి కలెక్టరేట్ విజయ్ కుమార్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఎల్లారెడ్డి నుంచి ప్రేమ్ కుమార్ కలెక్టరేట్ కార్యాలయం ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో పనిచేసిన ఉమాలత రామారెడ్డికి బదిలీ అయ్యారు.
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం కు సరళ భాయ్ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం సూపర్డెంట్ ప్రేమ్ కుమార్ ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి ఉమలత కలెక్టరేట్ నుంచి రామారెడ్డికి బదిలీ అయ్యారు. అలా ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మంగళవారం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ మరో ఉత్తర్వులను జారీ చేశారు.
దీంతో బదిలీ అయిన తాసిల్దారులు మరోసారి ఉత్తర్వులు వెలువడడంతో కంగు తిన్నారు. రాజకీయ ఒత్తిడీల మేరకే తాసిల్దార్ ల బదిలీలు 24 గంటల్లోనే తారుమారు కావడం పలు విమర్శలకు తావిస్తోంది. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్ ఉత్తర్వులు జారి చేసిన తీరు పై తాసిల్దార్లు ఆందోళన చెందుతున్నారు. సరదా భాయ్, శ్వేతను బదిలీ జాబితా నుంచి తొలగించారు. 24 గంటల్లో తాసిల్దార్ల బదిలీ ప్రక్రియ జిల్లాలో చర్చని అంశంగా మారింది.