మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరు మండల, మున్సిపాలిటీ పరిధిలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం నిర్వహిస్తున్న గ్రామసభలను విజయవంతం చేయాలని మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డి (Tahasildar Raghava Reddy) కోరారు. సోమవారం కొండాయిగూడెం గ్రామంలో ఆయన రైతు భరోసా సర్వే(Rythu Bharosa Survey)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రాఘవరెడ్డి మాట్లాడుతూ... జనవరి 21 నుంచి 24 వరకు నిర్వహిస్తున్న గ్రామ సభలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపికలు పారదర్శకత పాటించేందుకు నిర్వహిస్తున్న ఈ సభలకు ఆయా ప్రాంతాల వారు సకాలంలో హాజరుకావాలన్నారు. ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేయని పక్షంలో గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.