calender_icon.png 1 April, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దె భవనం.. అరకొర వసతులు

27-03-2025 01:42:32 AM

సతమతమవుతున్న తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది

 రెండు విభాగాలకు ఒకే రూం  పార్కింగ్‌కు తప్పని తిప్పలు

జనగామ, మార్చి 26: ఓ వైపు అద్దె భవనం.. మరో వైపు అరకొర వసతుల మధ్య తహసీల్దార్ కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు. జనగామ మండలంలోని తరిగొప్పుల మండలంలో తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం కల నెరవేరడం లేదు. దీంతో అసౌకర్యాల నడుమ సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం తరిగొప్పల నూతన మండలండగా ఏర్పడగా.. అప్పటి నుంచి కనీసం తహసీల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం సొంత భవనం మంజూరు చేయలేదు. ఈ కార్యాలయానికి అనేక రెవెన్యూ సంబంధిత పనుల కోసం రోజుకు వందలాది మంది వస్తుంటారు. ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్లు ఇక్కడే జరగడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకు తగ్గట్టుగా ఇక్కడ వసతులు లేకపోవడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

కార్యాలయం ఆవరణలో పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ప్రధాన రహదారి పక్కనే కార్యాలయం ఉండడంతో ఆఫీసు ముందు వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల అప్పుడప్పుడు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు నెలకు కార్యాలయ భవనానికి రూ.5 వేలకు పైగే అద్దె చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై కిరాయి భారం పడుతోంది. కార్యాలయంలో తహసీల్దార్‌తో పాటు పది మంది సిబ్బంది పనిచేస్తుంటారు. ఆఫీస్ కు రెగ్యులర్‌గా సుమారు 20 మంది డాక్యుమెంట్ రైటర్లు వస్తుంటారు. ఇలా రద్దీగా ఉండే తహసీల్దార్ కార్యాలయం ఇరుకు భవనంలో ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఒకే రూములో రెండు విభాగాలు..

కార్యాలయంలో వివిధ విభాగాలకు సంబంధించి ప్రత్యేకంగా రూములు ఉండాలి. కానీ అద్దె భవనం చిన్నది కావడంతో ఆర్‌ఐ క్యాబిన్, కంప్యూటర్లంతా ఒకే రూములో నిర్వహిస్తున్నారు. ఆర్‌ఐ ఉండే రూములోనే మూడు కంప్యూటర్లకు గానూ ముగ్గురు సిబ్బంది ఉంటున్నారు. ఇలా ఇరుకు గదిలోనే వారంతా పనిచేయాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజన సమయంలోనూ అసౌకర్యంగా ఉంటోందని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇంత పెద్ద కార్యాలయానికి ఉన్న ఒకే ఒక్క వాష్‌రూం కూడా సరిగా లేదని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా తమకు సువిశాలమైన సొంత భవనం మం