calender_icon.png 31 March, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి

28-03-2025 08:41:52 PM

రేషన్ డీలర్లకు తాసిల్దార్ నాగరాజు ఆదేశాలు

కాటారం,(విజయక్రాంతి): పేద ప్రజలకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న నిత్యవసర సరుకులను సక్రమంగా అందించాలని కాటారం తహసిల్దార్ నాగరాజు రేషన్ దుకాణ డీలర్లను ఆదేశించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండలంలోని డీలర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాల స్థలంలోనే సమయ సూచిక  ప్రకారంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. అలాగే ప్రతి దుకాణం ముందర దుకాణం పేరు వివరాలను తెలియజేసే వివరాలు నేమ్ బోర్డును విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. బియ్యం పంపిణీలో అవకతవకలు లేకుండా అర్హులైన వారందరికీ సక్రమంగా పంపిణీ జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పీ డీ ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా డీలర్లు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. డీలర్లు తమ డీలర్స్ షిప్ పత్రాలను పునరుద్ధరించుకోవాలని అన్నారు. దుకాణాల తనిఖీకి వచ్చిన అధికారులకు రేషన్ డీలర్లు రికార్డుల విషయంలో సహకరించాలని తాసిల్దార్ నాగరాజు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మార్క రామ్మోహన్ గౌడ్, గిర్ధవార్ వెంకన్న, రేషన్ దుకాణ డీలర్లు పాల్గొన్నారు.