calender_icon.png 3 April, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పంపిణీ చేసిన తాహసీల్దార్ ఎండి ముజీబ్

02-04-2025 06:55:24 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీనీ బుధవారం మండల తహాసీల్దార్ ఎండి ముజీబ్ తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుండి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగా మండలంలోని వివిధ రేషన్ షాపులలో పంపిణీ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ ఎండి ముజీబ్ తనిఖీ చేశారు. ప్రజలకు సరఫరా చేస్తున్నా తీరును పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఎలాంటి సమస్య రాకుండ సక్రమంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. తహసీల్దార్ వెంట మండల గిర్దవార్ ఎం శంకర్ పాల్గొన్నారు.