calender_icon.png 27 December, 2024 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ దాడిలో పట్టుబడిన తహసీల్దార్

04-07-2024 03:19:59 AM

వనపర్తి, జూలై 3(విజయక్రాంతి): వనపర్తి జిల్లా గోపాల్‌పేట తహసీల్దార్  శ్రీనివాసులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బుధవారం ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పేట మండలం జింకల బీడుతండాకు చెందిన మూడవ పాండు తన భార్య పేరున ఉన్న వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తహసీల్దార్ రూ.8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మూడవ పాండు ఏసీబీని ఆశ్రయించడంతో బుధవారం సాయంత్రం పాండు నుంచి తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

దమ్మపేట ఆర్‌ఐపై సస్పెన్షన్

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 3(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  దమ్మపేట రెవెన్యూ కార్యాలయ ఆర్‌ఐ బజ్బా ఎర్రయ్యను సస్పెండ్ చేస్తూ బుధవారం కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. దమ్మపేట మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన బండి లక్ష్మీ నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. ఆ పత్రం జారీకి ఆర్‌ఐ రూ.10వేలు లంచం అడిగినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణ జరిపి, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.