calender_icon.png 18 March, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తహశీల్దారు వినతి

17-03-2025 05:46:33 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండల కేంద్రానికి చెందిన పిడుగు సాయమ్మ, శాంతవ్వ, గంగవ్వలకు చెందిన నివాసపు ఇండ్లు సోమవారం విద్యుత్ ఘాతానికి గురై కాలిపోవడంతో నిరాశ్రయులైన వారికి నివాసపు ఇండ్లు అందించాలని కోరుతూ సోమవారం తహశీల్దార్ శ్రీలతకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సాయికిరణ్, యోగేశ్, హన్మాంత్ తదితరులు పాల్గొన్నారు.