10-04-2025 04:49:55 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): 2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడి(Mumbai terror attack accused) కేసులో ప్రధాన నిందితుడైన తహవుర్ రాణా(Tahawwur Rana case) గురువారం భారత్ కు చేరుకున్నాడు. నిన్న తహవుర్ రాణాను అమెరికా అధికారులు ప్రత్యేక విమానంలో భారత్ కు పంపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పాలమ్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడిని తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ల్యాండ్ అయిన వేంటనే ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు సమాచారం. 2008లో జరిగిన ముంబయి ఉగ్రదాడిపై ఎన్ఐఏ న్యాయముర్తి విచారించిన తర్వాత ప్రత్యేక భద్రత నడుమ తీహార్ జైలుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా ముంబయిలో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది ఎఫ్బీఐ అతడిని అరెస్టు చేసి భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024వ తేదీన ఆమోదం తెలిపింది. అయితే తనను తప్పుగా ఈ కేసులో దోషిగా ప్రకటిస్తున్నారంటూ రాణా రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కానీ రాణా పిటిషన్ ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంలో అధ్యక్షుడు డ్రొనాల్డ్ ట్రంప్ తో తహవూన్ రాణాను భారత్ కు అప్పగించడంపై సంప్రదింపులు జరిపారు. ఎట్టకేలకు రాణాను భారత్ కుఅప్పగించనందుకు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.