calender_icon.png 31 January, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత కస్టడీకి తహవూర్ రాణా

26-01-2025 12:19:25 AM

  1. ముంబై ఉగ్రదాడిలో దోషి
  2. అప్పగింతకు అమెరికా సుప్రీం కోర్టు ఆమోదం

న్యూఢిల్లీ, జనవరి 25: ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు యూఎస్ సుప్రీం కోర్టు అంగీకరించింది. 26/11 ముంబై దాడుల్లో కీలకంగా వ్యవహరించిన తహవూర్ రాణాను తమకు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా పోరాడుతోంది.

అయితే భారత ప్రభుత్వ అభ్యర్థనను సవాల్ చేస్తూ రాణా.. పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాడు. ఆయా కోర్టుల్లో రాణాకు చుక్కెదురవడంతో.. నవంబర్ 13న అమెరికా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. రాణా వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చూస్తూ 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

ఆ అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు.. రాణా పిటిషన్‌ను తాజాగా తిరస్కరించింది. దీంతో రాణాను అమెరికా ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో భారత్‌కు అప్పగించనుంది. కాగా 2009లో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను చికాగోలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు లాస్ ఏంజెల్స్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.