calender_icon.png 25 April, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహవూర్ రాణాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురు

25-04-2025 02:24:35 AM

ఢిల్లీ, ఏప్రిల్ 24: ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. తన కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించాలని అతడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని చెబుతూ నిందితుడి అప్పీల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వ్యతిరేకించింది.

తహవూర్ తన కుటుంబసభ్యులతో మాట్లాడడానికి అనుమతి ఇస్తే కీలక విషయాలు చెప్పే అవకాశముందని కోర్టులో వాదించింది. ఈ క్రమంలో తహవూర్ పిటిషన్‌ను గురువారం ఢిల్లీ న్యాయస్థానం కొట్టేసింది. తన క్షేమం గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారని, వారితో మాట్లాడటం తన ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ తహవూర్ రాణా ఇటీవలే కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

దీనిపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ కోర్టు ఎన్‌ఐఏ ఆదేశించింది. తహవూర్‌ను ఏప్రిల్ 10న భారత్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు ఈ నెల 28 వరకు కస్టడీ విధించింది.