calender_icon.png 21 March, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా టైక్వాండో కుంఫూ ఛాంపియన్ షిప్ 2025

18-03-2025 12:35:25 AM

శేరిలింగంపల్లి, మార్చి 17(విజయ క్రాంతి):చందానగర్ పీజేఆర్ స్టేడియం ఛాంపియన్ కిక్ బాక్సింగ్ మార్షల్ ఆరట్స్ అకాడమీ కోచ్ డి.లక్ష్మణ్ ఆధ్వర్యంలో 3 వ నేషనల్ కరాటే టైక్వాండో కుంఫూ ఛాంపియన్ షిప్ 2025 ను ఘనంగా నిర్వహించారు.

యూనివర్సల్ 369 షోటోకాన్ కరాటే అకాడమీ నిర్వహణలో  మేడ్చల్ లో జరిగిన కరాటే, కుంగ్ ఫూ పోటీలో పలువురు విద్యార్థులు సత్తా చాటి ప్రతిభ కనబరిచారు. ఇందులో ఎం. ధనుష్ రెడ్డి, ఎ. రోహిత్ హనుమాన్, అకిల్, గీత కృష్ణ, ఏకాంశ్ శివ దుర్గా, కె. గోవర్ధన్ లు గోల్ మెడల్ ను కైవసం చేసుకోగా ఎం. రిషికేశ్వర్ రెడ్డి, ఎ. జిష్ణు వర్ధన్, డి.పార్థు ప్రజయ్ లు సిల్వర్ మెడల్ లను దక్కిందుకున్నారు.

అనంతరం యూనివర్సల్ 369 షోటోకాన్ కరాటే అకాడమీ వ్యవస్థాపకులు శిహాన్ జి. సాయి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కోచ్ లక్ష్మణ్ తో కలిసి విజేతలకు మెడల్స్, ప్రశంస పత్రాలను అందజేశారు. పోటీలో ఘన విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు.