రాజేందరానగర్ (విజయక్రాంతి): ఆదివారం ఉదయం జరిగిన "టైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్" విజయవంతంగా జరిగింది. చీఫ్ ఎగ్జామినర్ గా గ్రాండ్ మాస్టర్ ఏ. ప్రవీణ్ కుమార్ 6 డాన్ (జనరల్ సెక్రెటరీ- తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ), వారి బృందం ఆధ్వర్యంలో టైక్వాండో స్టూడెంట్స్ కు కలర్ బెల్టులు బహుకరించి, స్టూడెంట్స్ కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా బాలబాలికలు వయస్సుతో భేదం లేకుండా ఈ టైక్వాండోను అభ్యసించి ఆరోగ్యం చక్కని గుణశీలత పొందుతారని దీనివలన ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ టైక్వాండో కోచింగ్ ఇచ్చినటువంటి ప్రముఖ కోచ్ లు ఎస్.ప్రదీప్ కుమార్ 4 డాన్, బి.సురేష్ 4 డాన్(టెంపుల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్) వీరు ఇరువురుని అభినందించినారు.