19-04-2025 11:19:12 PM
కామారెడ్డి (విజయక్రాంతి): విధి నిర్వహణలో నిర్లక్యం వహించిన తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లుపై (Tadvai SI Venkateshwarlu) సస్పెన్షన్ వేటుపడింది. ఈ నెల 12న ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఆయన వచ్చిన సమయంలో తాడ్వాయి ఎస్సై అందుబాటులో లేరు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లవద్దనే నిబంధన ఉన్నప్పటికీ ఎస్సై తన సొంత ఊరికి వెళ్లారు. ఈ విషయమై స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్, డీఎస్పీకి చెప్పకుండానే స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఎస్సై వెంకటేశ్వర్లును ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు. తాడ్వాయి ఎస్సైగా వీఆర్లో ఉన్న రాజయ్యకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు.