calender_icon.png 19 April, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూరి చిత్రంలో టబు

11-04-2025 12:00:00 AM

విజయ్ సేతుపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను ఉగాది సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చార్మీ కౌర్‌తో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్నారు డైరెక్టర్ పూరి. ఇందులో విజయ్ సేతుపతి మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపి స్తారని చిత్రబృందం చెబుతోంది. ఇలా ఉండగా ఈ సినిమాలో నటి టబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ తాజాగా ప్రకటించారు.

జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్రబృందం కీలక పాత్ర అని చెప్తున్నప్పటికీ టబు.. పూరీ ప్రాజెక్టులో ప్రతినాయికగా కనిపించనుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్ టాక్.