అక్టోబర్ 6న భారత్, పాక్ పోరు
దుబాయ్: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3న మొదలుకానున్న మెగాటోర్నీ అక్టోబర్ 20న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌లు ఉన్నాయి. అక్టోబర్ 6న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్ డే కేటాయించింది. మ్యాచ్‌లన్నీ దుబాయ్, షార్జా వేదికల్లో జరగనున్నాయి. టీమిండియా గ్రూప్ దశలో విజయాలు సాధిస్తే తొలి సెమీఫైనల్ ఆడే అవకాశముంది.
ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్‌లు
తేదీ మ్యాచ్‌లు
అక్టోబర్ 4 భారత్ x న్యూజిలాండ్ దుబాయ్
అక్టోబర్ 6 భారత్ x పాకిస్థాన్ దుబాయ్
అక్టోబర్ 9 భారత్ x శ్రీలంక దుబాయ్
అక్టోబర్ 13 భారత్ x ఆస్ట్రేలియా షార్జా
అక్టోబర్ 17 తొలి సెమీఫైనల్ దుబాయ్
అక్టోబర్ 18 రెండో సెమీఫైనల్ షార్జా
అక్టోబర్ 20 ఫైనల్ దుబాయ్