calender_icon.png 29 March, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభలో టీషర్ట్ రగడ

21-03-2025 01:03:04 AM

  • నినాదాలు రాసి ఉన్న టీషర్టులు ధరించి వచ్చిన ప్రతిపక్ష ఎంపీలు

తప్పుబట్టి..బయటకు వెళ్లమన్న స్పీకర్ ఓంబిర్లా

న్యూఢిల్లీ, మార్చి 20: కొంత మంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కేంద్రాన్ని విమర్శించే విధంగా నినాదాలు రాసి ఉన్న టీషర్ట్‌లను ధరించి పార్లమెంట్‌కు రావడంతో స్పీకర్ ఓం బిర్లా వారి వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఇలా చేయడం సభా నియమాలకు విరుద్ధం అని తెలిపిన స్పీకర్ అలా నినాదాలు ఉన్న టీషర్ట్‌లతో సభకు హాజరైన ఎంపీలను బయటకు పంపారు.

బయటకు వెళ్లి దుస్తులు మార్చుకుని రావాల్సిందిగా ఆదేశించారు. ‘సభలో కొంత మంది సభ్యులు హూందాత నాన్ని పాటించడం లేదు. సభా గౌరవానికి భంగం కలిగిస్తున్నారు’ అని పేర్కొన్నారు. సభకు వచ్చే ఎంపీలు తప్పనిసరిగా పార్లమెంట్ నిబంధనల్లో 349వ రూల్ తెలుసు కోవాలన్నారు.

ఎక్కువ మంది డీఎంకే ఎంపీలే.. 

నినాదాలు రాసి ఉన్న టీషర్ట్‌లను ధరించిన వారిలో ఎక్కువ శాతం డీఎంకే పార్టీ ఎంపీలే ఉన్నారు. డీలిమిటేషన్‌కు సంబంధించిన నినాదాలు ముద్రించిన టీషర్ట్‌లతో వారు సభకు హాజరయ్యారు. డీలిమిటేషన్ రగడతో సభ వాయిదా పడింది. మొదట 12 గంటల వరకు వా యిదా వేయగా.. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైనా కానీ రగడ తగ్గకపోవడంతో మధ్యాహ్నం 2 వరకు సభను వాయిదా వేశారు.

సభ వాయిదా పడిన తర్వాత కొంత మంది డీఎంకే ఎంపీలు పార్లమెం ట్ ఆవరణలో నిరసన తెలిపారు. ‘ఫెయిర్ డీలిమిటే షన్, తమిళనాడు విల్ ఫైట్, తమిళనాడు విల్ విన్’ అని రాసి ఉన్న టీషర్ట్‌లు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు. డీఎంకే ఎంపీలు కని మొళి, శివ తదితరులు నిరసనల్లో పాల్గొన్న వారిలో ఉన్నారు. కాగా ఈ నెల 22న డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల నేతలతో తమిళనా డు ప్రభుత్వం సమావేశం నిర్వహించనున్నది.

ఈ సమావేశానికి హాజర వుతామని కన్నడ నేతలు తెలిపారు. ‘కేంద్రం చెప్పిన విధంగా జనాభాను నియంత్రించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపిస్తున్నారు. నియోజకవ ర్గాల పునర్విభజన ను జనాభా ప్రాతిపదికన కాకుండా వేరే పద్ధతుల్లో చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు.