calender_icon.png 25 November, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి టీ-సాట్ పాఠ్యాంశాలు

25-11-2024 02:34:51 AM

  1. పోటీ పరీక్షల అభ్యర్థులకు సదవకాశం
  2. సీఈవో వేణుగోపాల్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): పోటీ పరీక్షలకు యువత ను సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా టీసాట్ పనిచేస్తోందని సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కంటెంట్‌ను సోమవారం నుంచి ప్రసారం చేయనున్నట్టు తెలిపారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్, 10 సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్‌ను 500 రోజులు ప్రసారం చేస్తున్నామని ప్రకటించారు. టీ నిపుణ ఛానల్‌లో మధ్యా హ్నం 12 నుంచి ఒంటిగంట వరకు, మూడు నుంచి నాలుగు గంటల వరకు.. విద్య ఛానల్‌లో అదే రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మళ్లీ ప్రసారమవుతాయని తెలిపారు.

పోటీ పరీక్షల్లో ప్రధాన సబ్జెక్టులైన తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ, మ్యాథ్స్, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులతోపాటు సో షల్ ఎక్స్‌క్లూజన్, జనరల్ ఇంగ్లిష్ వం టి ప్రత్యేక సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ కూడా ప్రసారం చేస్తామని వివరించారు.

ఈ పాఠ్యాంశాలను పో టీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉపయోగించు కోవాలని సూచించారు. టీసాట్ ప్రసారాల ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే తమ ప్రయత్నాలకు ఫలితం దక్కిందన్న ఆనందం కలుగుతోందని వేణుగోపాల్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.