calender_icon.png 25 September, 2024 | 5:56 AM

టీ-కన్సల్ట్ పనితీరు భేష్

25-09-2024 03:54:49 AM

  1. ప్రపంచ కుబేరుడు కార్లోస్ స్లిమ్ 
  2. కార్లోస్ స్లిమ్‌తో టీ-కన్సల్ట్ చైర్మన్ సందీప్ భేటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఏఐ ఆధారిత టెలీ కన్స ల్టేషన్ ప్లాట్ ఫాంపై ఆసక్తి కనబర్చడమే కాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్ల పూల్ ఏర్పాటు చేస్తున్న టీ చొరవ బాగున్నదని అపర కుబేరుడు కార్లోస్ స్లిమ్ ప్రశంసించారు. టీ చైర్మ న్ సందీప్ మఖ్తల మంగళవారం కార్లోస్ స్లిమ్ హెలూతో భేటీ అయ్యా రు.

ఈ సందర్భంగా టీ ఇంటర్నేషనల్ లోగోను కార్లోస్ స్లిమ్ ఆవి ష్కరించారు. మెక్సికోలో జరిగిన ఈ సమావేశంలో టీ ఆవిష్కరణ పట్ల కార్లోస్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. టీ ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ పూల్ ద్వారా భారతదేశానికి పెట్టుబడులను రప్పించేందుకు కృషి చేస్తున్న ట్టు సందీప్ పేర్కొన్నారు. అంతర్జాతీ య వ్యాపారాన్ని సులభతరం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.