calender_icon.png 30 October, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ కన్సల్ట్, టీ హబ్ ఒప్పందం

07-07-2024 01:27:44 AM

  • లోకల్ స్టార్టప్స్ గ్లోబల్ కనెక్ట్స్ నినాదం 
  • సమగ్ర మార్గదర్శకత్వంతో విశ్వవ్యాప్త అవకాశాలు 
  • ఈ నెల 14న 30 స్టార్టప్‌లతో జాయింట్ వెంచర్ 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిష్కరణలకు అంతర్జాతీయ అవకాశాలే లక్ష్యంగా టీ కన్సల్ట్, టీ హబ్ మధ్య కీలక ఒప్పందం శనివారం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ర్ట ఇన్నోవేషన్లకు సమగ్రమైన మార్గదర్శకం, సహాయ సహకారాలు అందనున్నాయి. లోకల్ స్టార్టప్స్- గ్లోబల్ కనెక్ట్స్ అనే నినాదంతో మన అంకురాలు అంతర్జాతీయ అవకాశాలకు చేరడం సాధ్యం కానుంది. తెలుగు స్టార్టప్, ఇన్నోవేషన్లకు అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నప్పటికీ సరైన అనుసంధానం లేకపోవడంతో ఆయా అవకాశాలను సొంతం చేసుకోలేకపోవడాన్ని టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ మక్తాల తన అధ్యయనంలో గుర్తించారు. ఈ నేపథ్యంలో మన ఆవిష్కరణలకు అంతర్జాతీయంగా అవకాశాలకు అనుసంధానించేందుకు మార్గాలను అన్వేషించారు.

దీనిలో భాగంగా టీ హబ్‌తో టీ కన్సల్ట్ ఒప్పందం కుదుర్చుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ మేరకు నేడు టీ హబ్‌లో సీఈవో మహంకాళి శ్రీనివాసరావు టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం విశ్వవ్యాప్తంగా ఉన్న అవకాశాలను తెలంగాణ ఇన్నోవేషన్లు, స్టార్టప్‌లు సొంతం చేసుకోనున్నాయి. ఒక స్టార్టప్‌కు సంబంధించిన సమగ్రమైన సహకారం, సమాచారం, సమన్వయం అందించనుంది. అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్‌లు, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ టూర్లను టీ కన్సల్ట్ , టీ హబ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. స్టార్టప్‌ల మధ్య స్థానికంగా కీలక సమన్వయం కుదిరే కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లో 30 స్టార్టప్ల మధ్య పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. టీ కన్సల్ట్, టీహబ్ ఒప్పందం ఫలితంగా ఇది తొలి అడుగు కానుంది.