calender_icon.png 17 November, 2024 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవస్థాపరంగా ముఖ్యమైన బ్యాంక్‌లు ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ

14-11-2024 01:46:51 AM

లిస్ట్ చేసిన రిజర్వ్‌బ్యాంక్

ముంబై, నవంబర్ 13: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు దేశంలో వ్యవస్థాపరంగా ముఖ్యమైన బ్యాంక్‌లని (డీ ఎస్ ఐబీలు) రిజర్వ్‌బ్యాంక్ లిస్ట్ చేసింది. డీ ఎస్‌ఐబీలు (డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇం పార్ట్‌ంట్ బ్యాంక్స్) బుధవారం ఆర్బీఐ విడుదల చేసింది. 

ఫిబ్రవరిలోనూ రేట్ల కోత ఉండదు 

రిజర్వ్‌బ్యాంక్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సైతం వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని ఎస్బీఐ రీసెర్చ్ తాజా రిపోర్ట్‌లో అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నదని, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం కలవర పరుస్తున్నదని, ఈ నేపథ్యంలో ఆర్బీఐ తొలి రేట్ల కోత 2025 ఫిబ్రవరి తర్వాతే ఉంటుందని పేర్కొంది.

వచ్చే జనవరి నుంచి ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గుముఖం పట్టవచ్చని, అయితే అం దుకు ధరలు తగ్గడం కారణం కాదని, బేస్ ఎఫెక్ట్‌తో తగ్గుదల కన్పిస్తుందని, అందుచేత ఫిబ్రవరిలో ఆర్బీఐ రేట్ల కోత ఉండ దంటూ ఎస్బీఐ రీసెర్చ్ వివరించింది.