calender_icon.png 11 January, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవస్థాగత మార్పులు అభినందనీయం

02-11-2024 12:00:00 AM

కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అంశంలో తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పులు అభినందనీయమని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు రోల్ మోడల్‌గా నిలిచేలా కేంద్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తామన్నారు.

శుక్రవారం తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన సంజీవ్ చోప్రా రాష్ర్ట పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ర్టంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, అందులో తీసుకొచ్చిన వ్యవస్థాగత మార్పులను వివరించారు.

అనంతరం ఆయన ఏజీ కాలనీలోని చౌక ధరల దుకాణాన్ని సందర్శించి అక్కడ వినియోగదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమల నాణ్యతను పరిశీలించారు. రేషన్ డీలర్ల పనితీరు బాగుందని, బియ్యం, గోధుమల సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారన్నారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీయస్ చౌహాన్, డైరెక్టర్ జసింతా లాజరస్ పాల్గొన్నారు.