జేరుసలం: హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను చంపింది తామేనని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కాట్జ్ అంగీకరించారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇజ్రాయెల్ ఘోరమైన నేరానికి పాల్పడినందున ప్రతిగా తాము చేసిన క్షిపణి దాడులను ఇరాన్ సమర్థించుకుంది. ఇజ్రాయెల్ హనియాను చంపడం హేయమైన ఉగ్రవాద చర్యకిందకి వస్తుందని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవాని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఉగ్రపాలన ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పుగా మారుతోందని వ్యాఖ్యనించారు. సిరియా కొత్తగా నియమితులైన విదేశాంగ మంత్రి అసద్ హసన్ అల్-షిబానీ మాట్లాడుతూ సిరియాలో గందరగోళాన్ని వ్యాప్తి చేయవద్దని, సిరియా ప్రజల ఇష్టాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలంటూ ఇరాన్ ను హెచ్చరించారు.