calender_icon.png 28 December, 2024 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సిండికేట్’ బిల్లు! మద్యంప్రియుల జేబుకు చిల్లు!

28-12-2024 01:51:40 AM

  1. అధిక ధరకు విక్రయిస్తున్న వైన్స్ యజమానులు
  2. పక్కాగా అమ్మకాలు జరిగేలా ప్రణాళిక

హుజురాబాద్, డిసెంబర్ 2౭ (విజయ క్రాంతి) : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో అన్ని వైన్ షాప్‌లు సిండికేట్‌గా ఏర్పడి మద్యం అధిక ధరలకు అమ్మకాలు జరిగేలా పక్కా ప్రణాళిక రచించారు. వైన్స్‌షాప్‌లలో సేల్స్ పెరగడం లేదనే సాకును ముందుగా సృష్టించారు, దీంతో ఎక్సుజ్ టార్గెట్ పూర్తి కావాలంటే పట్టణంలోని 9 వైన్ షాప్‌లు కాకుండా బెల్ట్ షాప్‌లలో కూడా సేల్స్ పెంచాలనే యోచనకు వచ్చారు.

పట్టణంలోని బెల్ట్ షాప్‌లే కాకుండా పల్లె ప్రాంతాలలోని గ్రామ పంచాయతీలను టార్గెట్‌గా చేసుకున్నారు. ఇదంతా ఇక్కడి వరకు బాగానే వుంది. టార్గెట్ పెంచేందుకు మద్యం సేల్స్ పెంచవచ్చని అధికారులతో కూడా శభాష్ అని పించుకున్నారు. కానీ బెల్ట్ షాప్‌ల ద్వారా సేల్స్ పెంచవచ్చని తెలిపి అధిక ధరల భారంతో మద్యం ప్రియుల  జేబుకు చిల్లు పెట్టారు.

ఏకంగా క్వార్టర్ పై 30 రూపాయల అదనపు భారాన్ని పెంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. మద్యం సేల్స్ పెంచవచ్చని తెలిపి మద్యా న్ని బహిరంగ మార్కెట్లో బెల్ట్ షాప్‌లా ద్వారా అమ్మి సిండికేటు యాజమాన్యం అధికారుల కళ్ళుగప్పి అధిక లాభార్జన వేటలో మునిగారు. అధికా రులకు తెలిసే ఇదంతా జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇం దులో అధికారులకు వా టా ఉందో లేదో అధికారులే చెప్పాలనే ప్రశ్న మొదలైంది.

ప్రైవేటు వ్యక్తులా? అబ్కారీ ఉద్యోగస్తులా?

మద్యం సిండికేట్ నుండి ప్రైవేటు వ్యక్తులే అమ్మకాలు కొనసాగిస్తారు. ఏ బెల్ట్ షాప్ లో ఎంత మద్యం అమ్ము తారు ముందుగా తెలుసుకు ని రాయల్ స్టాగ్, ఐబి ఏదైనా ఒక క్వార్టర్‌పై 15 రూపా యలు అధికంగా తీసుకుం టారు. దాన్ని బెల్ట్ షాప్ యజ మాని ఏ క్వార్టర్ బాటిల్ పైన అయినా 30 రూపాయల అధికంగా అమ్మాలని ధర నిర్ణయిస్తారు.

రాయల్ స్టాగ్ క్వార్టర్‌కు 210 ఎంఆర్‌పి ఉంటే దాన్ని 225 రూపాయలకు బెల్ట్ షాప్ యజమాని కొనుగోలు చేస్తు న్నారు. అదే క్వార్టర్ బెల్ట్ షాప్‌కి చేరుకోగానే 240 కి అమ్ముతున్నారు. అన్ని బాటిళ్ళపై సిండికే ట్ నడిపే నియంత సంతకంతో కూడిన స్టికర్ అతికిస్తారు.

ఆ స్టికర్ ఉన్న మందు తప్ప వేరే మందు అమ్మితే వారి వద్ద నున్న స్టాక్ మొత్తం జప్తు చేస్తారు. ఓ ప్రయివేట్ సైన్యం ఈ సిండికేట్ యజ మానులు కింద పని చేస్తుంది. వారిని చూసి గ్రామాల్లో అబ్కారీ శాఖ వారే వచ్చారని అను కుంటారు. పల్లెల్లోని బెల్ట్ షాప్‌లపై వారి ఇస్టాను సారంగా ప్రవర్తిస్తారు.

వాటాదారులు ఎంత మంది..?

మద్యం సిండికేట్ వ్యవ హారంలో ఎక్సుజ్ శాఖ సైలెంట్‌గా ఉండటంతో ఈ సిండికేట్‌లో ఎక్సుజ్ శాఖ వాటా ఎంత అనే అను మానాలు కూడా మొదల య్యాయి. ఇప్పటికే హుజు రాబాద్‌లోని 9 వైన్‌షాప్‌లు కాకుండా డివిజన్‌లోని ఇంకో రెండు మండలాల వైన్ షాపులు కూడా ఈ సిండికేట్‌లో చేరాయని వార్తలు వస్తున్నా యంటే హుజురాబాద్ పరిధి దాటి కూడా ఈ మద్యం సిందికేటు అధికారుల అండ దండలతో నడుస్తుందని అనుమా నాలకు తావు ఇస్తుంది.

కాగా మద్యం సిండికేట్ వ్యక్తులు కాకుండా ఇతరులు చాలా మంది వాటాదారులు ఉన్నట్టు టోకెన్ సిస్టమ్‌లో గత సంవత్సర కాలం నుండి బినామీ వాటాదారులు పెట్టుబడి పెట్టి అధిక లాభాల కోసం ఎదుచూస్తున్నట్టు సమా చారం ప్రచారం కూడా జరుగుతుంది.

సేల్స్ టార్గెట్..

టార్గెట్ పూర్తి చేయాలనే ఆలోచనలో మద్యం సిండికేట్ ఏర్పడి బెల్ట్ షాప్‌లా నిర్వహణ గ్రామ పంచాయితీ ప్రజల వరకు మద్యం అందుబాటులోకి వచ్చింది కానీ మద్యం మత్తులో మద్యం ప్రియుడి జేబుకే చిల్లు పడింది, రాష్ర్ట స్థాయి నుండి రవాణా జరిగిన అన్ని ప్రాంతాల్లో ఓకే ధరకు అమ్మినా కేవలం పట్టణంలోని కాలనీల్లో, పల్లెల్లో అధిక ధరలను నిర్ణయి స్తున్న మద్యం సిండికేట్ ను తొలగించాలని  కోరుతున్నారు. జిఎస్‌టీ పరిధిలోకి రాని మద్యం సిండికేట్‌కు అధిక ధరలు నిర్ణయిం చే అధికారం ఏదైనా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వినియోగదారుడి జేబుకే చిల్లు

మా గ్రామపంచాయితీ పరిధిలో ఉన్న బెల్ట్‌షాప్‌లలో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి, హుజు రాబాద్ పట్టణం నుండి నుండి ఇక్కడికి మద్యం రావాలంటే 15 రూపాయలు ఒక్క క్వార్టర్ బాటిల్‌పై అదనంగా తీసుకుంటారు. ఇక్కడ మద్యం బెల్ట్ షాప్‌లలో అదే క్వార్టర్‌పై 30 రూపా యల అదనంగా అమ్మకాలు జరుగు తాయి. దీనివళ్ళ వినియోగదారుడికి ఒక్కో క్వార్టర్‌కు 30 రూపాయల భారం. మధ్య తరగతి నిరుపేద ప్రజలపై భారం పడుతుంది.

 --పల్లపు సాంబరాజు, రాంపూర్