calender_icon.png 9 October, 2024 | 8:42 PM

అమరుల త్యాగాల గుర్తులు

09-10-2024 12:00:00 AM

ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గిరిజన పోరాట వీరుడు కొమురం భీం పోరాట పటిమ, ఇంద్రవెల్లి అమరవీరుల రక్తతర్పణం. నాటి సాతంత్య్ర పోరాటం నుంచి మొదలుకొని.. సరాష్ర్ట ఉద్యమం వరకు ఆదిలాబాద్ జిల్లా ఆయా పోరాటాల్లో భాగస్వామ్యం కలిగి ఉంది. అటు బ్రిటీష్, ఇటు నిజాం నిరంకుశతం నుంచి విముక్తి కల్పించేందుకు సాగిన పోరాటాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంతోమంది యోధులు పాలుపంచుకున్నారు.

నిజాంకు వ్యతిరేకంగా కొనసాగిన పోరాటమే జిల్లాలో సాతంత్య్ర ఉద్యమంగా పేరుపొందింది. నాడు ఉమ్మడి జిల్లాలోని  ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, సిర్పూర్ ప్రాంతాల్లో రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. సిర్పూర్, రాజూరా, కాగజ్ నగర్, చనాకాలలో ప్రత్యేక శిబిరాలు కూడా నిరహించారు. 

ఆదిలాబాద్ యోధులు

గిరిజన నాయకుడు రాంజీ గోండ్ నిర్మల్ కేంద్రంగా బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు నిరహిస్తే, నిజాం పోలీసుల చేతుల్లో దోపిడీకి గురైన గిరిజనులను మేల్కొలిపి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజన వీరుడు కొమురంభీం పోరాటం సాగించారు. జల్.. జంగిల్.. జమీన్... నినాదంతో గిరిజనుల విముక్తి కోసం పోరాటం సాగించి వీర మరణం పొందారు.

గిరిజన యోధుడు రాంజీ గోండ్ సహా అతని అనుచరులను ఉరి తీసిన మర్రిచెట్టు ప్రస్తుతం వెయ్యి ఊడల మర్రిగా స్థిరపడిపోయింది. ఇదిలా ఉంటే హక్కుల కోసం పోరాడుతూనే నిజాంకు వ్యతిరేకంగా, సాతంత్ర భావనకు అనుకూలంగా ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఇక్కడి సమరయోధులు కృషి చేశారు. 

కమ్యూనిస్టులు సైతం

ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం కూడా జరిగింది. రాంకిషన్ శా), దాజీ శంకర్, కస్తాల రామకిష్టు తదితరులు జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి విశేషంగా కృషిచేశారు. సాతంత్య్ర సమరయోధుడైన హన్మంతు స్ఫూర్తితో అతడి తనయుడు వన్నెల ఎల్లన్న భార్య దేవుబాయితో కలిసి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు.

ఆదిలాబాద్ ప్రాంతంలోని నిజాం వ్యతిరేక పోరాట యోధులు, సాతంత్య సమరయోధులు చిరస్మణీయులుగా నిలిచిపోయారు. వీరి పోరాటాలకు గుర్తుగా కమ్యూనిస్టు పార్టీ ఆధర్యంలో నిర్మించిన ప్రత్యేక స్థూపాలు, వారి పేరిట ఏర్పాటుచేసిన కాలనీలు త్యాగాలకు గుర్తుగా నిలుస్తున్నాయి. మరోవైపు నాటి యోధుల జ్ఞాపకార్థం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటుచేసి, దానిపై వారి పేర్లు చెక్కించారు. ఈ స్థూపం నిలువెత్తు స్మృతి చిహ్నంగా నిలుస్తోంది.

 -ఆదిలాబాద్, విజయక్రాంతి