calender_icon.png 12 March, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింబియాసిస్ యూనివర్సిటీలో ఢిల్లీ విద్యార్థి మృతి

11-03-2025 11:57:08 AM

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మొదల్లగూడలో ఉన్న అంతర్జాతీయ సింబియాసిస్ విశ్వవిద్యాలయం(of International Symbiosis University)లో మూడవ సంవత్సరం చదువుతున్న లా కళాశాల విద్యార్థి షాగ్నిక్ బాసు(22) మృతి చెందాడు. సోమవారం రాత్రి సమయంలో బాత్రూంకి వెళ్ళిన విద్యార్థి ఎంతకీ బయటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెంటిలేటర్ లోంచి గమనించగా కిందపడి ఉన్నాడు. వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. తలుపులు పగులగొట్టి బయటకు తీసి, చికిత్స నిమిత్తం శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరిస్తే.. అక్కడి నుంచి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.