calender_icon.png 25 January, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ సింగరేణియన్ గా సయ్యద్ అబ్బాస్

24-01-2025 06:20:51 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని ఆర్కే ఓసిపిలో ఫోర్ మెన్ ఇంచార్జ్ (ఎలక్ట్రిషన్) గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అబ్బాస్ ఉత్తమ సింగరేణియన్ గా ఎంపికయ్యాడని ఆయనను గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి హెడ్ ఆఫీస్ కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సింగరేణి సీఅండ్ఎండి బలరాం చేతుల మీదుగా ఘనంగా సన్మానించనున్నట్లు సింగరేణి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏరియాలోని వివిధ గనుల్లో విధులు నిర్వహిస్తున్న 12 మంది కార్మికులను ఉత్తమ కార్మికులుగా ఎంపిక చేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.

ఉత్తమ కార్మికులుగా ఎంపికైన వారిలో ఏ శ్రవణ్ కుమార్ ఫిట్టర్ శాంతిఖని, దుర్గం రాజేష్ జనరల్ మజ్దూర్ శాంతిఖని, ఎన్ సుభాష్ చంద్రబోస్ ఓవర్ మెన్ కాసిపేట 2, గుగులోత్ సురేష్ ఫిట్టర్ కాసిపేట 2, లీనాల వెంకటయ్య లైన్మెన్ కాసిపేట ధని, కడారి శ్రీనివాస్ ట్రామర్ కాసిపేట గని, ఎండి చాంద్ కాలేజీ ఆపరేటర్ కేకే 5, బండారి తిరుపతి ఓవర్ మన్ కేకే 5, జి శ్రీనివాస్ హెడ్ ఓవర్ మెన్ కేకే 5, కే రమేష్ వెల్డర్ కేకే ఓసిపి, సిహెచ్ రమేష్ ఎంవి డ్రైవర్ ఆర్కేపీ ఓసిపి, కొండు శేషన్ కుమార్ జనరల్ మజ్దూర్ ఆర్కే ఓసిపి లు ఎంపికయ్యారు. వీరిని ఈనెల 26న ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు.