బెంగళూరు: టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత అమ్మాయిల బృందం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సుధీర్ఘ సిరీస్‌కు సిద్ధమైంది. ఆదివారం బెంగళూరు వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరగనుంది. ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయిన హర్మన్ సేన ఆ తర్వాత బంగ్లాదేశ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5 క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో సఫారీలతో తొలి వన్డేకు సిద్ధమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మలు భారత బ్యాటింగ్‌లో వెన్నుముకగా నిలవనున్నారు.
టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ బరిలోకి దిగడంపై స్పష్టత రాలేదు. వికెట్ కీపర్ రిచా ఘోష్‌తో పాటు యస్తికా భాటియా, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలు రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పేసర్లు రేణుకా సింగ్, అరుంధతీ రెడ్డి.. స్పిన్నర్లు ఆశా శోభన, శ్రేయాంక పాటిల్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు స్వదేశంలో లంకతో జరిగిన టీ20 సిరీస్‌ను 2 ఓడిపోయిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను 1 సమం చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ సూపర్ ఫామ్‌లో ఉంది.
గత ఐదు మ్యాచ్‌ల్లో లారా వరుసగా 102, 56, 41, 110*, 184* తో దుమ్మురేపింది. జట్టులో సీనియర్లు అయిన మారీన్ కాప్, ఆయబొంగా కాకా, నదినే డిక్లెర్క్ కీలకం కానున్నారు. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం సఫారీలతో టీమిండియా ఏకైక టెస్టుతో పాటు మూడు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడనుంది.