calender_icon.png 10 January, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వింగ్ కింగ్ ట్రంప్

07-12-2024 02:11:36 AM

అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ లగ్జరీ లైఫ్‌స్టుల్  బయటికి కనిపించినా వ్యాపార, రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. 90వ దశకంలో దాదాపు దివాళా తీసే దశకు చేరుకున్నారు. కానీ మళ్లీ పుంజుకుని తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారు. 2016లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2020 లో ఓటమి తర్వాత ట్రంప్ ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు. క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారుల దాడి తర్వాత ట్రంప్ రాజకీయ జీవితంపై అనుమానాలు వ్యక్తమయ్యా యి. కానీ, వాటన్నింటినీ పక్కకునెట్టి సుస్పష్టమైన ఆధిక్యంతో ట్రంప్ రెండోసారి అధ్య క్షుడిగా ఎన్నికయ్యా రు. ఈసారి ట్రంప్ గెలుపునకు ఎన్నో అంశాలు దోహదం చేశాయి. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, సరిహద్దులో అక్రమ వలసలు, అంతర్జాతీయ యుద్ధాలకు ధన, ఆయుధ సాయం వంటి సమస్యలకు ట్రంప్ పరిష్కారం చూపుతారని అగ్రరాజ్య ఓటర్లు నమ్మారు. 

* శ్రామిక శక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే డెమోక్రాట్లకు గ్రామీణ, కార్మిక వర్గంతో నుంచి మద్దతు లభించేది. కానీ ఈ ఎన్నికల్లో వీరంతా ట్రంప్‌వైపు మొగ్గుచూ పారు. అమెరికా ఫస్ట్ నినాదంతో స్థానికులకే ఉద్యోగాలని ఆకట్టుకున్నారు.   

* చైనా నుంచి దిగుమతులపై 60 శాతం, బ్రెజిల్, భారత్ వంటి దేశాలకు 20 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇది దేశీయంగా ఉత్పత్తి పెంపుతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. 

* అక్రమ వలసలపై ట్రంప్ మొదటి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా చొరబాటుదారులను అస్సలు అంగీకరించేది లేదని, ఇప్పటికే దేశంలో అక్రమంగా ఉంటున్న లక్షలాది మందిని తరిమేస్తానని హామీ ఇచ్చారు. ఇది కౌంటీలతో పాటు యువతలో ఉత్సాహం నింపింది. 

* డ్రగ్ సంబంధిత నేరాలు, విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్ డీలర్లకు మరణశిక్ష విధించేందుకు ట్రంప్ మద్దతు తెలపడంతో కొన్ని వర్గాలు రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చాయి. 

* అంతర్జాతీయ యుద్ధాలకు ట్రంప్ దూరంగానే ఉంటారనే అంశం సైతం ఆయనకు దోహదం చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ రష్యా ఉద్రిక్తతల్లో అమెరికా ఆయుధ సరఫరాను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ వస్తే ఈ విధానంలో మార్పు వస్తుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. 

* అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యకు చేరుకుంది. ఈ విషయంలో ట్రంప్ విధానాలు అనుకూలిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

* రెండుసార్లు ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం కూడా సానుభూతి ఓట్లకు కారణమైందనే విశ్లేషణలు ఉన్నాయి. 

* ట్రంప్ గెలుపులో అతిపెద్ద పాత్ర స్వింగ్ స్టేట్లదే. దాదాపు అన్ని స్వింగ్ స్టేట్లలో ట్రంప్ సత్తా చాటారు. 

ట్రంప్‌పై కేసుల మాటేమిటి?

వాషింగ్టన్, నవంబర్ 7: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. 2020లో ఓటమి తర్వాత ట్రంప్ అనేక కేసుల్లో నేరారోప ణలు ఎదుర్కొన్నారు. ఆయనపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ  ట్రంప్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అధ్యక్షుడిగా తన విచక్షణాధికారాలు ఉపయోగించి తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకుని ఫెడరల్ కేసుల్లోంచి బయటపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే పోర్న్‌స్టార్‌కు డబ్బులిచ్చిన కేసు, 2020 ఎన్నికల్లో జార్జియా ఫలితాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న కేసులో ఎటువంటి అధికారాలు పని చేయవట. ఈ రెండు కేసులు ముగింపు దశకు చేరు కున్నాయి. న్యాయస్థానం ఈ నెల 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కోర్టు తీర్పును వాయిదా వేయించేందుకు ట్రంప్ తర ఫు లాయర్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ లాయర్ల ప్రయత్నాలు ఫలించకపోయినా కోర్టు స్వల్ప శిక్షతోనే సరిపెట్టే అవకాశాలు ఉన్నాయి.