calender_icon.png 25 April, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈత సరదా విషాదం కారాదని..

25-04-2025 02:34:33 AM

వనపర్తి టౌన్ ఏప్రిల్  24: వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు, సరదాకోసం, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువలకు వెళుతుంటారు ఈత సరదా విషాదం కారాదని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.సెలవులు ఉన్నందున పిల్లలు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నం దున ఇట్టి క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తగా ఉండాలి అన్నారు.

ఈత సరదా విషాదంగా మారకూడదని సూచించారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈతను నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా చిన్నారులను ఈత కొట్టడానికి పంపించడం ద్వారా ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు, కాలువల వద్దకు, కుంటలు వద్దకు, క్వారీ గుంతల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ వేసవికాలంలో జిల్లాలోఈతకు వెళ్ళినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన క ల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామ ని,పోలీసుశాఖతో ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కోరారు.