21-04-2025 12:18:01 AM
సూర్యాపేట, ఏప్రిల్ 20: పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఈత నేర్చుకోవాలనే సరదా, కుతూహలంగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా బావి, కాలువల్లోకి దూకి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని, ఈత నేర్చుకోవాలనే సరదా విషాదం కావొద్దని ఆదివారం ఒక ప్రకటనలో ఎస్పీ కె నరసింహ అన్నారు.
ఈత రాని వారు పెద్దలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోను చెరువులు, కుంటలు, బావులు, కాలువల వద్దకు వెళ్ళకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకోవాలన్నారు.