calender_icon.png 28 February, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్విమ్మింగ్ పూళ్లను అందుబాటులోకి తీసుకురావాలి

28-01-2025 05:52:59 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియా పరిధిలోని మందమర్రి రామకృష్ణపూర్ లలో సింగరేణి యజమాన్యం నిర్మించిన స్విమ్మింగ్ పూళ్లను (ఈతకొలను) అందుబాటులోకి తీసుకువచ్చి కార్మికుల వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ ఉపాధ్యక్షులు బీమనాధుని సుదర్శన్ లు డిమాండ్ చేశారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను వారు సందర్శించి మాట్లాడారు. గత కొద్ది రోజులుగా స్విమ్మింగ్ పూల్ నిరుపయోగంగా ఉండడంతో స్విమ్మింగ్ కు వచ్చే వారికి అందులోనీ నీరు ఫిల్టర్ కాకపోవడం, నాచు పేరుకుపోయి దురదతో కూడిన చర్మ వ్యాధులు వచ్చి అనారోగ్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గతంలో ఏరియా జియంకు స్విమ్మింగ్ పూల్ మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదించినప్పటికీ యాజమాన్యం కాలయాపన చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కార్మికుల సంక్షేమం కోసం నిధులు వెచ్చిస్తున్నామంటున్న యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్ల రూపాయలు అప్పనంగా అప్పజెప్తున్నారనీ వారు సింగరేణి యాజమాన్యంపై తీవ్రంగా మండిపడ్డారు. కార్మికులు కష్టించి సంస్థను లాభాలలో నడపడానికి కృషి చేస్తే కార్మికుల చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సింగరేణి కార్పోరేట్ యాజమాన్యం వెంటనే స్పందించి స్విమ్మింగ్ పూల్ లకు నిధులు వెచ్చించి మరమ్మతులు చేయించాలని వారు డిమాండ్ చేశారు.