calender_icon.png 13 January, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ ప్రథమార్థంలో స్విగ్గీ రూ.12,000 కోట్ల ఐపీవో

21-10-2024 01:43:19 AM

ముంబై, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ప్రతిపాదించిన రూ. 12,000 కోట్ల ఐపీవో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నవంబర్ నెల ప్రధమార్థంలో జారీకావచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా లేకపోతే ఆఫర్ జారీ సమయం మారవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గత నెలలో స్విగ్గీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించిన ముసాయిదా ప్రకారం రూ.3,750 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఐపీవోలో జారీచేయనుంది.

తాజా ఈక్విటీతో సమీకరించే మొత్తాన్ని రూ. 4,500 కోట్ల వరకూ పెంచే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరో 18.23 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో ప్రస్తుత షేర్‌హోల్డర్లు విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ జారీ, ఓఎఫ్‌ఎస్‌లతో కలిపి మొత్తం రూ. 12,000 కోట్ల (1.42 బిలియన్ డాలర్లు) పబ్లిక్ ఆఫర్ జారీకావచ్చని ఆ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం స్విగ్గీ లో విదేశీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ప్రొసస్‌కు 32 శాతం వాటా ఉండగా, సాఫ్ట్‌బ్యాంక్ వద్ద 8 శాతం, యాక్సెల్ వద్ద 6 శాతం చొప్పున వాటా ఉన్నది. 

నేడు 4,300 కోట్ల వారీ ఎనర్జీస్ ఐపీవో

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ముంబై కేంద్రంగా కార్యక లాపాలు నిర్వహిస్తున్న సోలార్ ప్యానల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్ రూ.4,321 కోట్ల సమీకరణ కోసం జారీచేస్తున్న ఇనీ షియల్ పబ్లిక్ ఆఫర్ అక్టోబర్ 21న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 23న ముగుస్తుంది. ఆఫర్కు ప్రైస్ బ్యాండ్ రూ. 1,427-1,503.ఈ ఐపీవో రూ.  3,600 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల ను కంపెనీ జారీచేస్తున్నది. మరో రూ. 721 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓ ఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తారు.

25న ఆఫ్యాన్స్ ఇన్ఫ్రా ఆఫర్

షాపూర్జి పల్లోంజి గ్రూప్ ఇన్ఫ్రాస్ట్ర క్చర్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా ఆఫర్ అక్టోబర్ 25న ప్రారంభమై 29న ముగు స్తుంది. రూ.5,400 కోట్ల సమీకరణకు జారీ అవుతున్న ఈ ఐపీవోలో రూ. 1,250 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్ర యిస్తారు. ఓఎఫ్ఎస్ రూట్లో రూ.4,180 కోట్ల విలువైన షేర్లను జారీచేస్తారు.