calender_icon.png 30 October, 2024 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్విగ్గీ రూ.11వేల కోట్ల ఐపీఓ

29-10-2024 12:29:15 AM

సబ్‌స్క్రిప్షన్ తేదీ, ధరల శ్రేణి వివరాలు

ముంబై:  ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ధరల శ్రేణిని రూ.371-390గా నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం రూ.11,300 కోట్ల సమీకరణకు వస్తున్న స్విగ్గీ పబ్లిక్ ఇషూసబ్‌స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 5న విండో తెరుచుకోనుంది. ఐపీఓలో భాగం గా రూ.6,800 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులు తమ షేర్లు విక్రయించనున్నారు.

మరో రూ.4500 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించనున్నారు. ఈ నిధులు కంపెనీకి చేరను న్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్రోసస్‌కు స్విగ్గీలో 31శాతం వాటా ఉంది. ఎంఐహెచ్ ఇండియా ఫుడ్ హోల్డింగ్స్ రూపంలో వాటాలు ఉన్నాయి. ఇందులో ఐదో వంతు వాటాను ఐపీఓలో భాగంగా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్ బ్యాంక్‌కు కూడా స్విగ్గీలో వాటాలు ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన స్విగ్గీని 2014లో స్థాపించారు. 2022లో చివరిసారిగా నిధులను సమీకరించిన వేళ కంపెనీ విలువ 10.7 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఇదే విభాగంలో 2021లో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన జొమాటో రూ. 9,375 కోట్లు నిధులను సమీకరించింది. ఇష్యూ ధర కంటే 52 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది. గతేడాది 136 శాతం మేర రాణించింది. ఈ ఏడాది వస్తున్న అతి పెద్ద ఐపీఓల్లో స్విగ్గీ కూడా ఒకటి కావడం గమనార్హం.