calender_icon.png 16 January, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ నగరాలనుంచే స్విగ్గీ వెజ్ ఆర్డర్లు అధికం

01-08-2024 01:09:12 AM

తొలి స్థానంలో బెంగళూరు, మూడో స్థానంలో హైదరాబాద్

ముంబయి: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తాజా నివేదికలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. చాలామంది మాంసాహారాలను తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ పలు నగరాల్లో శాకాహారాన్ని అత్యధికంగా ఆర్డర్ చేసుకుంటున్నట్లు  తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో బెంగళూరు ప్రథమస్థానంలో ఉండగా ముంబయి, హైదరాబాద్ నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  బెంగళూరును ‘వెజ్జీవ్యాలీ’గా అభివర్ణించిన స్విగ్గీ తమకు దేశవ్యాప్తంగా వచ్చిన శాకాహార ఆర్డర్లలో మూడింటిలో ఒకటి ఈ నగరంనుంచే వచ్చినట్లు  తెలిపింది. మసాలా దోశ, పన్నీర్ బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలాను తినేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. రెండో సానంల్లో నిలిచిన ముంబయిలో  దాల్‌కిచిడీ, మార్గరీటా పిజ్జా, పావ్‌భాజీని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. హైదరాబాద్ వాసులు మసాలా దేశ, ఇడ్లీని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట.