calender_icon.png 17 November, 2024 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్విగ్గీ ప్రీమియం లిస్టింగ్

14-11-2024 01:50:41 AM

న్యూఢిల్లీ, నవంబర్ 13: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్న స్విగ్గీ షేర్లు బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో ప్రీమియం ధరతో లిస్టయ్యాయి. ఆఫర్ ధర రూ.390తో పోలిస్తే  బీఎస్‌ఈలో 5.6 శాతం అధికంగా రూ. 412 వద్ద లిస్టయిన సిగ్గీ తదుపరి 10 శాతం వరకూ పెరిగి రూ.465 వద్ద నిలిచింది.ఈ ధర వద్ద కంపెనీ మార్కెట్ విలువ రూ. 92 వేల కోట్లుగా ఉన్నది.  రూ.11,327 కోట్ల సమీకరణకు గతవారం జారీఅయిన స్విగ్గీ ఐపీవో 3.6 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. 

500 మంది స్విగ్గీ ఉద్యోగులు కోటీశ్వరులు

స్విగ్గీ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లను పొందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగుల్లో 500 మంది కంపెనీ లిస్టింగ్‌తో కోటీశ్వరులయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 5,000 మంది ఉద్యో గులు పొందిన స్టాక్ ఆప్షన్ల విలువ లిస్టింగ్‌నాటి షేరు ధర ప్రకారం రూ.9,000 కోట్లని ఆ వర్గాలు వివరించాయి.