calender_icon.png 10 October, 2024 | 7:01 PM

దిగొచ్చిన స్విగ్గీ యాజమన్యం

10-10-2024 04:13:59 PM

అమరావతి,(విజయక్రాంతి): స్విగ్గి అనగానే మనకు టక్కున గుర్తువచ్చేది ఫుడ్. అలాంటి స్విగ్గికే ఏపీ హెటల్ అసోసియేషన్ భారీ షాక్ ఇచ్చింది.  హోటల్స్ అసోసియేషన్ హెచ్చరికలతో స్విగ్గి యాజమన్యం దిగివచ్చింది. ఈనెల 14వ తేదీ నుంచి స్విగ్గీ ఆర్డర్లు నిలిపివేయాలని ఇటీవల హోటల్ అసోసియేషన్ తీర్మానం చేసిన ప్రకటన ప్రకంపనలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో స్విగ్గి దిగి వచ్చింది. స్విగ్గీ సంబంధింత అధికారులు గురువారం విజయవాడలో అత్యవసర భేటీ నిర్వహించి, చర్చలు జరిపారు. స్విగ్గి నిబంధనలు నష్టదాయకంగా ఉన్నాయని హోటల్ అసోసియేషన్ ఆరోపించింది. జీరో కమిషన్ తో మొదలు పెట్టి 30 శాతానికి మించి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండానే రాయితీలు, కాంబో ప్యాక్ ల ప్రకటనలు, వినియోగదారులు చెల్లించే మొత్తాలను స్విగ్గి వెంటనే హోటల్ అకౌంట్లలో జమ చేయట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్యల అనంతరం సాయంత్రం 5 గంటలకు చర్యల సారాంశాన్ని స్విగ్గీ, ఏపీహెచ్ఏ వెల్లడించనుంది.