calender_icon.png 6 January, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్విగ్గీ సరికొత్త మెంబర్‌షిప్ ప్లాన్

13-12-2024 12:00:00 AM

ముంబై:  ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ  ప్రత్యేక మెంబర్‌షిప్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. మెరుగైన సేవలు, సౌల భ్యం కోరుకొనే వినియోగదారుల కోసం ‘One BLCK’ పేరిట దీన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. అయితే ఈ సభ్యత్వం పొందాలంటే స్విగ్గీ నుంచి ప్రత్యేకమైన ఆహ్వానం అందాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన సభ్యులు మాత్ర మే ఈ మెంబర్‌షిప్ ప్లాన్ ప్రయోజనా లు ఉపయోగించుకోవచ్చు.

‘స్విగ్గీ వన్ బ్లాక్ సేవలతో ప్రతి ఫుడ్ ఆర్డర్స్ ఫాస్ట్ డెలివరీ, ఆన్-టైమ్ గ్యారెంటీ పొందొ చ్చు. డైన్‌ఔట్ సమయంలో కాంప్లిమెంటరీగా కాక్‌టెయిల్స్, డ్రింక్స్, డెజర్ట్స్ ఆస్వాదించొచ్చు’అని స్విగ్గీ తన స్టాక్ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. అంతేకాదు వన్ బ్లాక్ కస్టమర్లు ఇన్‌స్టా మార్ట్‌లో ఉచిత డెలివరీలు, డైన్‌అవుట్స్‌పై  ప్రత్యేక డిస్కౌంట్‌లోసహా ‘స్విగ్గీ వన్’ మెంర్‌షిప్‌లోని అన్ని ప్రయోజనాలు పొందుతారు. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ వంటి అగ్ర భాగస్వామి బ్రాండ్ల నుంచి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందొచ్చని వెల్లడించింది.