న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న స్విగ్గీ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.625.53 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. నిరుడు ఇదేకాలంలో నమోదైన రూ. 657 కోట్లకంటే ఈ మూడు నెలల్లో స్వ ల్పంగా తగ్గింది. ఈ జూలై త్రైమాసికంలో స్విగ్గీ ఆదాయం రూ.2,763 కోట్ల నుంచి రూ.3,601 కోట్లకు చేరింది.
గత నెల లో స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టయిన స్విగ్గీ తొలిసారిగా తన ఆర్థిక ఫలితాల్ని ఎక్సేంజ్‌లకు రిపోర్ట్ చేసింది. తమ సబ్సిడరీ స్కూట్సీ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈక్విటీ రూపంలో రూ.1,600 కోట్లు పెట్టుబడి చేయడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు స్విగ్గీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. స్కూట్సీ ప్రస్తుతం సప్లు చైన్ సర్వీసులు, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 5,195 కోట్ల టర్నోవర్ సాధించింది.
క్విక్‌కామర్స్ స్టోర్స్‌ను విస్తరిస్తాం
వచ్చే ఏడాది మార్చికల్లా తమ క్విక్‌కామ ర్స్ స్టోర్స్ సంఖ్యను 1,045కు పెంచుతామ ని, 40 లక్షల చదరపు అడుగుల వైశాల్యానికి విస్తరిస్తామని స్విగ్గీ తెలిపింది. ఇన్‌స్టామార్ట్ బ్రాండ్ పేరుతో స్విగ్గీ క్విక్‌కామర్స్ వ్యా పారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమ స్మాల్‌ఫార్మాట్ స్టోర్లను పెద్ద స్టోర్లుగా మారుస్తామని పేర్కొంది. వినియోగదారులు ఎం చుకునే ఐటెమ్స్‌ను పెంచుతామని, 10 నుం చి 30 నిముషాల్లో డెలివరీ చేస్తామన్నది.