calender_icon.png 25 October, 2024 | 11:55 AM

జొమాటో బాటలోనే స్విగ్గీ.. ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన సంస్థ

25-10-2024 12:00:00 AM

ముంబయ్కి: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగీసైతం పాట్‌ఫామ్ ధరలు పెంచింది. ఇకపై ప్రతి ఆర్డర్ పైనా రూ.10 చొప్పున వసూలు చేయనుంది. ఇంతకు ముందు ఈ ప్లాట్‌ఫామ్ ఫీజుగా రూ.7 వసూలు చేసేది. జొమాటో తన ప్లాట్‌ఫామ్  ధరల్ని పెంచిన తర్వాత స్విగ్గీ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.  ప్లాట్‌ఫామ్ ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని స్విగ్గీ యాప్ చూస్తే స్పష్టమవుతోంది.

యాప్ ఓపెన్ చేయగానే ఆర్డర్  ప్లాట్‌ఫామ్  ఫీజు హైదరాబాద్‌లో రూ.10గా చూపిస్తోంది. ఇక జొమాటో కూడా తన  ప్లాట్‌ఫామ్  ఫీజును రూ.10కి పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే తొలుత ఇవన్నీ రూమర్లే అని వార్తలు వ్యాపించడంతో కంపెనీ ఈ విషయంపై తాజాగా స్పందించింది. ప్లాట్‌ఫామ్  ఫీజు పెంపు వాస్తవమే అని వెల్లడించింది. ‘పండగ సీజన్లో సేవలు అందిం చేందుకు ప్లాట్‌ఫామ్  ధరలు పెంచాం.

మా బిల్లులు చెల్లించేందుకు ఈ రుసుములు సాయపడతాయి’ అని కంపెనీ తన యాప్ ద్వారా తెలియజేసింది. నగరాల వారీగా ఈ పెంపులో వ్యత్యాసం ఉంటుందని జొమాటో తెలిపింది. అయితే ఏ నగరాల్లో పెంచిందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇరు సంస్థలు ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా అనేకసార్లు ఈ ధరల్ని పెంచుతూ వచ్చాయి.