10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవలు విస్తృతం
న్యూఢిల్ల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవలు ‘బోల్ట్’ను మరిన్ని నగరాలకు పరిచ యం చేసింది. దేశవ్యాప్తంగా 400 నగరాలు, పట్టణాలకు విస్తరించినట్లు సోమ వారం కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తొలుత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పుణె వంటి పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ సేవల ను.. తాజాగా జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, కోయంబత్తూర్ వంటి నగరాలకూ విస్తరించింది.
టైర్-2, టైర్-3 పట్టణాలైన గుం టూరు, వరంగల్, జగిత్యాల, రూర్కీ, నాసిక్‌లోనూ ఇకపై 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ము ఖ్యంగా ఏపీ, తెలంగాణలో ‘బోల్ట్’ కు ఎక్కు వ ఆదరణ ఉంటోందని స్విగ్గీ వెల్లడిం చింది. ఆ తర్వాతి స్థానంలో హర్యానా, తమిళనా డు, గుజరాత్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నట్లు పేర్కొంది.
పూర్తిగా తయారీ అవసరం లేని లేదా తయారీకి తక్కువ సమయం మాత్రమే పట్టే ఆహార పదార్థాలను ‘బోల్ట్’ కింద అందించనున్నట్లు స్విగ్గీ తెలిపింది. ఈ తరహా ఆర్డర్లకు ప్రాధాన్యం ఇచ్చేలా రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని పేర్కొం ది. అయితే, డెలివరీ బాయ్స్ భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి సాధారణ, బోల్ట్ డెలివరీ గురించి తెలియజేయడం లేదని తెలిపింది. ‘బోల్ట్’ డెలివరీకి ఎలాంటి అదనపు ప్రోత్సాహకాలూ ఇవ్వడం లేదని పేర్కొంది. ప్రస్తుతానికి 2 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ సేవలను పరిమితం చేశామని, భవిష్యత్‌లో దీన్ని విస్తరిస్తామని స్విగ్గీ పేర్కొంది.