calender_icon.png 15 January, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వియాటెక్ సాఫీగా

04-09-2024 01:08:49 AM

  1. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్
  2. పెగులా, మయియా ముందంజ
  3. క్వార్టర్స్‌లో సిన్నర్, మెద్వెదెవ్ పోరు

న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో పోలండ్ బామ ఇగా స్వియాటెక్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. రెండో యూఎస్ ఓపెన్ టైటిల్‌పై కన్నేసిన స్వియాటెక్ ఆ ఘనత సాధించేందుకు మూడు అడుగుల దూరంలో నిలిచింది. మంగళవారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో స్వియాటెక్ 6-4, 6-1తో 16వ సీడ్ సమ్సోనోవా (రష్యా)పై పెద్దగా కష్టపడకుండానే సునాయాస విజయాన్ని నమోదు చేసింది. గంటన్నర పాటు సాగిన పోరులో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన స్వియాటెక్ రెండు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించింది.

మ్యాచ్‌లో 3 ఏస్‌లు కొట్టిన స్వియాటెక్ 14 విన్నర్లు సంధించింది. 3 డబుల్ ఫాల్ట్స్ చేసిన సమ్సనోవా 24 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరో సింగిల్స్‌లో ఆరో సీడ్ జెస్సికా పెగులా తన జోరును కొనసాగిస్తూ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో పెగులా (అమెరికా) 6-4, 6-2తో 18వ సీడ్ ష్నైడర్ (రష్యా)పై విజయం సాధించింది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో పెగులా 6 ఏస్‌లతో పాటు 22 విన్నర్లు సంధించింది. ఒక ఏస్‌కే పరిమితమైన ష్నైడర్ మూడు డబుల్ ఫాల్ట్స్‌తో పాటు 27 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో 22వ సీడ్ హడ్డాడ్ మయియా (బ్రెజిల్) వోజ్నియాకి (డెన్మార్క్)ని చిత్తు చేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 

సిన్నర్ జోరు..

పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ తన జోరును కొనసాగిస్తూ క్వార్టర్స్‌లో అడుగపెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో సిన్నర్ (ఇటలీ) 7 (7/3), 7 (7/5), 6 అమెరికా సంచలనం టామీ పాల్‌పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే టామీ పాల్ అంత తొందరగా తన ఓటమిని ఒప్పుకోలేదు. సిన్నర్ తొలి రెండు సెట్లను టై బ్రేక్‌లో నెగ్గడమే అందుకు నిదర్శనం. మరో మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన 25వ సీడ్ జాక్ డ్రాపర్ 6 6 6 మెక్‌హక్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. తద్వారా యూఎస్ ఓపెన్‌లో  ఆండీ ముర్రే (2016లో) తర్వాత క్వార్టర్స్ చేరిన బ్రిటన్ ఆటగాడిగా డ్రాపర్ నిలిచాడు. మరో మ్యాచ్‌లో పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6 3 6 7  తన దేశానికే చెందిన థాంప్సన్‌పై అతికష్టం మీద నెగ్గాడు. 

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్

ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌కు ఎదురులేకుండా పోయింది. రెండోసారి యూఎస్ ఓపెన్ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్న స్వియాటెక్ దర్జాగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు జెస్సికా పెగులా, మయియాలు కూడా ప్రిక్వార్టర్స్‌లో విజయాలు సాధించి ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ చేరిన ఇటలీ సంచలనం జానిక్ సిన్నర్ ఐదో సీడ్ డానిల్ మెద్వెదెవ్‌తో అమీతుమీకి సిద్ధమవ్వగా.. మరో క్వార్టర్స్‌లో తలపడనున్న జ్వెరెవ్, టేలర్‌లో ఎవరు ముందంజ వేస్తారనేది ఆసక్తికరం..!