calender_icon.png 18 November, 2024 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వియాటెక్ జోరు

16-08-2024 12:00:00 AM

సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ

మాసన్ (అమెరికా): మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్వియాటెక్ 6 7 6 గ్రచెవా (ప్రాన్స్)పై విజయాన్ని నమోదు చేసుకుంది. మరో సింగిల్స్‌లో ఒస్టాపెంకో అన్‌సీడెడ్ చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ముందంజ వేశాడు. ఇక జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకాకు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది.  మాజీ చాంపియన్లు వావ్రింకా, డొమినిక్ థీమ్, బియాంక అండ్రీస్కు కూడా వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆగస్టు 26న ప్రారంభం కానుంది.